RareDesi.com
సాధారణంగా ముట్లు (బహిష్టు) ఆగిపోయే సమయం వచ్చిందంటే మహిళల జీవితం ఇక ముగిసినట్లేనని చాలా మంది భావిస్తుంటారు. ఇక అక్కడ నుంచి కోరికలన్నీ చచ్చిపోతాయని, నైరాశ్యం వస్తుందని చెబుతుంటారు. కానీ పరిశోధనలు మరోలా చెబుతున్నాయి. అంతటితోనే జీవితం ఆగిపోతుందని చాలా మంది మహిళలు భావించడం లేదని ఆ సమయంలోనే మహిళలు మునుపటి కంటే ఎక్కువ శృంగార సామర్థ్యాన్ని కలిగి ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. రుతుక్రమం నిలిచిపోయే దశ 45-55 ఏళ్లకు మధ్యలో వస్తుంది. దీనినే మెనోపాజ్ అంటారు. హార్మోన్‌ల విడుదల సమయంలో గణనీయమైన మార్పులు వస్తాయని చెబుతుంటారు. మార్పులు వచ్చేది నిజమే అయినా విపరీతమైన మార్పులు అందరిలో కాదని పరిశోధకులు అంటున్నారు. మెనోపాజ్ దశలోకి మహిళలు వచ్చాక శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతుందని చెబుతుంటారు. కానీ అదంతా ఒట్టిదేనని అంటున్నారు పరిశోధకులు. బ్రిటన్, స్విట్జర్లాండ్ పరిశోధకుల చేపట్టిన అధ్యయనంలో ఇవన్నీ అపోహలేనని తేలింది. మహిళల శృంగార ఆరోగ్యంపై కొన్నేళ్లపాటు అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రీ మెనోపాజ్ మహిళల్లో కేవలం 22శాతం, పోస్ట్ మెనోపాజ్ మహిళల్లో కేవలం 23 శాతం శృంగార వాంఛలు తగ్గినట్టు వారి అధ్యయనంలో తేలింది. మిగిలిన 77 నుంచి 78 శాతం మంది తమ లైంగిక కోరికలను యథాతధంగా వెల్లడించారు. మరికొందరు ఇంకా ఎక్కువ కోరికలున్నట్లు వెల్లడించారు. ప్రీ మెనోపాజ్ మహిళల్లో 7 శాతం, పోస్ట్ మెనోపాజ్ మహిళల్లో 8 శాతం లైంగిక వాంఛలు పెరిగినట్టు తేలిందట. అంటే మహిళల్లో లైంగిక వాంఛలు స్థిరంగా ఉన్నట్టుగా పరిశోధకులు పేర్కొన్నారు. సో.. ఆ సమయంలో కోరికలు గుర్రాలై పరిగెడుతాయే తప్ప తగ్గే ప్రశ్నే లేదన్నమాట.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment