Showing posts with label ఒక జంట కలిసిన తరుణాన. Show all posts
Showing posts with label ఒక జంట కలిసిన తరుణాన. Show all posts

Sunday, 22 October 2017

ఒక జంట కలిసిన తరుణాన 4

RareDesi.com

telugu sex stories జానకిని వాసంతి తనగదిలోకి తీసుకెళ్ళింది.

    "అల్లరిచేస్తున్నావుటఏమిటి?" అంది జానకి కుర్చీలో కూర్చుంటూ.

    "అల్లరా! ఛా.ఛా.మహా బుద్దిమంతురాలిలాగా మసులుతున్నాను" బుద్దిమంతురాలిలాగా ముఖంపెట్టి అంది వాసంతి.

    మరి అమ్మ అలా అంది.?

    అంటుందంటుంది. అమ్మకేం పనిలేదు. ఇది పెళ్ళిచూపులో పెళ్ళో నాకేం అర్ధంకావటంలేదు. నానా ఆర్భాటం చేస్తున్నది. మామయ్య చెప్పాడుకదా అని ఊరుకొన్నాను లేకపోతేనా?

    "ఏం చేసేదానివి?"



    "ఉదయం కాలేజీకి వెళ్ళి, సాయంత్రం ఫ్రెండ్స్ తో గడిపి మొదటాట ఏ పిక్చర్ కో చెక్కేసి రాత్రి పది తర్వాత యిల్లు చేరేదాన్ని."

    జానకినవ్వి 'ఆ.ఆ.అంతపనీచేస్తావ్' అని కాస్త ఆగి 'వాసంతీ! ఓ విషయం అడుగుతాను దాచకుండా చెప్పాలి. చెపుతావా?' అంది.

    'నీదగ్గరా మామయ్య దగ్గర ఏందాచను, నా సంగతి తెలుసుగా అత్తయ్యా! అనుమానం ఎందుకు అడుగు.'

    "నీకు పెళ్ళిచేసుకోవాలనివుందా వాసంతీ!"

    జానకి అడిగే ప్రశ్న యిదనుకోలేదు వాసంతి. వెంటనే ఏంచెప్పలేక పోయింది.

    "బలవంతమేంలేదు. ఇష్టమయితేనే చెప్పు వాసంతీ!"



    "అహహ! అదేం లేదు అత్తయ్యా! నీ ప్రశ్న సరిగా అర్ధంకాలేదు అంతే."

    "జీవితంలో పెళ్ళిచేసుకోవా? లేక ప్రస్తుతం పెళ్ళాడే వుద్దేశ్యం లేదా?"

    "ఎందుకీ అనుమానం వచ్చింది అత్తయ్యా?"

    "ముందు నా ప్రశ్నకు జవాబు."

    "ఓ.కే' అని ఒక్కనిమిషం ఆలోచనలో మునిగిపోయింది వాసంతి. ఆ తర్వాత తలపంకించి 'నీ వుద్దేశ్యం నాకర్ధమయింది అత్తయ్యా! పెళ్ళిచూపులు వద్దన్నానని నాకు పెళ్ళి యిష్టం లేదని అనుకున్నావు. అవునా? అదేంలేదు. పెళ్ళి అంటే నా మనసు వురకలువేసి వూగిస లాడటంలేదు. అలా అని అయిష్టము లేదు. నా అభిప్రాయం అబ్బాయి అమ్మాయి చూసుకుని మాట్లాడుకుని వకరి మనసులు ఒకరికి అర్ధమయి ఏకాభిప్రాయానికొస్తే అప్పుడు పెళ్ళిచేసుకుంటే బాగుంటుంది. అది ముఖ్యమా? ఈ వెర్రి తతంగాలు ముఖ్యమా?" అంది.



    జానక్కి పూర్తిగా అర్ధంకాలేదు. "అంటే?" అంది.

    'ఈ యింట్లో నేనొక్కదాన్ని. నాన్నగారు సంపాదించింది వుండబట్టి ఫరవాలేదు. ఓ గుమస్తా ఉంటాడు. ఆయనకో అరడజనుమంది ఆడపిల్లలుంటారు. సంబంధంకుదరదు. బోలెడుసార్లు పెళ్ళిచూపులు చూడాల్సి వస్తుంది ఆ పిల్లలకు. పెళ్ళివారొచ్చినప్పుడల్లా కాఫీ, తిఫెన్లు, అదోదండగ, పైగా సంతలో గేదెని పరీక్షించినట్లు పిల్లని పరీక్షించడం యక్షప్రశ్నలు, తర్వాత పిల్లనచ్చలేదనో కట్నంచాలదనో కబురు, మళ్ళా కధ మొదలు. ఇప్పుడు మన ఇంట్లోనే చూడు. జాంగ్రీ, మైసూర్ పాక్, పెరుగు ఆవడలు, మిక్చర్, అరటి, యాపిలు పళ్ళు, వచ్చేవాళ్లు. పీకలదాకా మెక్కొచ్చు. వాళ్ళతాతగాడి సొమ్ములాగా, అసలువాళ్ళనని లాభం ఏముంది. ఇదంతా అమ్మ తప్పు ఇంకా క్రీంబిసికెట్లు తెప్పిద్దామా! గోల్డ్ స్పాట్ యిప్పిద్దామా! అని ఆలోచిస్తున్నది. ఇలాంటివాళ్లుంటే అలాంటివాళ్ళనని లాభం ఏముంది! ఇలాంటి సంబంధాలు ఎన్ని రావాలో ఎంత కర్చుకావాలో, హూఁ ఈతఫాకి వూరుకుంటాను. ఆపైన చస్తే పెళ్ళిచూపులకి వప్పుకోను." అంటూ ఆవేశముగా చిన్న లెక్చరిచ్చింది వాసంతి.

    "ఈనాటి యువతరంలో ముందు చూపువుంది. ఆవేశం వుంది. ముందుచూపు మంచిమార్గానికి దారిఅయితే. ఆవేశం అనర్ధకానికి దారి అయితే ,ఆవేశం అనర్ధకానికి హేతువు" అనుకుంది జానకి.

    "నువ్వు చెప్పిందీ నిజమే వాసంతీ! మనకీకర్చు కనిపించదు. ఓ సామన్యమైన గుమస్తా అయితే ఉప్మా కాఫేథొఇ సరిపెట్టవచ్చు. ఆవిధంగా పదిసార్లు చేయాల్సివస్తే పాపం కర్చేకదా! మొగపెళ్ళివారు దర్జాగా తిని పోతారు." అంది జానకి.

    అత్తయ్య తనమాటలకి వత్తాసు పలకటంతో వాసంతికి సంతోషం కలిగింది. ఆ సంతోషం దాచుకోలేక ఆపకుండా పదినిమిషాలు మాట్లాడింది వాసంతి. పెళ్ళిచూపులతో పెళ్ళిఅయితే మనసులు కలవవంది. పెళ్ళిచూపులు కర్చుతోకూడిన అవమానపు అని అంది. కట్నం ఒక దురాచారం అంది. పెళ్ళిలో కూడా జాగ్రత్తలు బరువులు బాధ్యతలు పెళ్ళికూతురికే అంది. మగపెళ్ళివారు ఎంత పెద్దతప్పు చేసినా తప్పులేదు. ఆడపెళ్ళి వారు చిన్నతప్పుచేసినా అది చాలా పెద్దతప్పు అంది. ఇలా చాలా జానకి చాలా అంది.



    వాసంతి చెప్పే అన్నిమాటలకి చిరునవ్వుతో అంగీకారంగా తల వూపింది వాసంతి వాక్ ప్రవాహం ఆగింతర్వాత. "నువ్వు చెప్పినవన్నీ అక్షరాలా నిజమే వాసంతీ! ఈ వ్యవస్తలో పాతుకుపోయిన మూఢాచారాలు ఒక్కనాటితో అంతంకావు. వ్యవస్తమారాలంటే వ్యక్తులు మారాలి. వ్యక్తులు మారాలంటే  వ్యవస్తలో అవకతవకలు ఏర్పడాలి. ఇదంతా నెమ్మదిగా జరిగేవిషయం. తలవగ్గేచోట తలవగ్గుతూ ఖండించే చోట ఖండిస్తూ ముందుకు సాగుతుంటే మార్పు అదేవస్తుంది. మీ అమ్మ చిన్నతనానికి నా చిన్నతనానికి నీ చిన్నతనానికి మళ్ళీ నా పిల్లల చిన్నతనానికి పోలికేలేదు. ఆలోచిస్తే ఎంత మార్పు వచ్చిందీ తెలుస్తుంది." అంటూ తనూ బుల్లిస్పీచ్ యిచ్చింది జానకి,

    "అత్తయ్య చెప్పిందాంట్లో నిజం లేకపోలేదు" అనుకుంది వాసంతి.

    వాసంతి అవునన్నదానికి అవునంటూ కాదన్నదానికి కాదంటూనే సమయం చూసుకుని నచ్చచెప్పేసి నచ్చచెప్పింది జానకి.

    ఆదిలక్షమ్మ కాఫీ పట్టుకురావటంతో వాళ్ళిద్దరి మధ్య మాటలాగి పోయాయి.

    ఆదిలక్షమ్మ జానకి రాబోయే పెళ్ళివారి గురించి చెప్పుకుంటుంటే అయిష్టముగా వింటూ కూర్చుంది వాసంతి.

                                         4

    వచ్చిన పెళ్ళివారిని మర్యాదగా ఆహ్వానించి కుర్చీలో కూర్చోపెడుతున్నారు వెంకట్రామయ్యగారు.

    గదిలోవున్న వాసంతి జానకి వాళ్ళమాటలు వింటున్నారు.



    ఆదిలక్షమ్మ పరుగులాంటి నడకతో గదిలోకివచ్చింది. వచ్చినంత తొందరగానే "జానకీ! అమ్మాయిని తీసుకురా వాళ్లు తొందరపడుతున్నారు. నేను కాఫీ ఫలహారాల సంగతి చూస్తాను. వాసంతీ! ఏమిటి అలాగే వస్తావా! అవ్వ. పమిట నిండుగా కప్పుకో, తలొంచుకుని కూర్చోటం మర్చిపోకు. చూడమ్మా జానకి! నా మాటలకి అదప్పుడే ముఖం చిట్లిస్తున్నది. నువ్వన్నా జాగ్రత్తగా చెప్పి తీసుకురా." అని వెళ్ళింది.

    "నా ఒళ్ళుమండి పోతున్నది," రుసరుసలాగుతూ అంది వాసంతి.  

Best Telugu Sex Stories

ఒక జంట కలిసిన తరుణాన 3

RareDesi.com

telugu sex stories "అలాగా! అయితే ఇది చాలా సీరియస్ గా ఆలోచించవలసిన విషయమే!"

    వీళ్ళమాటలు చూస్తుంటే ఆదిలక్షమ్మగారికి వళ్ళు మండిపోతున్నది. "ఏంరా రాధాకృష్ణా! నువ్వొచ్చావ్ వాసంతికి నచ్చచెప్పి ఓదారి చూపిస్తావనుకున్నాను. మాటలు వేళాకోళాలు యిలా అయితే ఎలారా!" అంది.

    "సరే! అసలు విషయానికొద్దాము. నువ్వు చెప్పేది సాంతం చెప్పు అక్కా! పూర్తిగా వింటాను. ఆతర్వాత వాసు చెపుతుంది. అదీవింటాను. ఆతర్వాత ఏంచేస్తే బాగుంటుందో నాకు తోచిన సలహాయిస్తాను. ఒకరు చెపుతున్నప్పుడు ఒకరు అడ్డంరావద్దు," అన్నాడు రాధాకృష్ణ.



    "బాగుందోయ్ నీమాట," అన్నారు వెంకట్రామయ్యగారు.

    మర్నాడు పెళ్ళివారు పెళ్ళిచూపులకి వాసంతిని చూడటానికి రాబోతున్నట్లు కబురురావటం, పెళ్ళివారిముందు ఎలా మెలగవలసింది వాసంతికి చెపితే వాసంతి ఎగిరిపడటం చెప్పి, రేపు ఈగండం గడిచేటట్లు మార్గం చూపరా రాధాకృష్ణా! అంది ఆదిలక్షమ్మ.



    "అమ్మా నాన్నగార్ల మనసు కష్టపెట్టడం యిష్టంలేక పెళ్ళిచూపుల కొప్పుకున్నా మామయ్య! ఓ మాట కొప్పుకున్నా కదా అనీ ఒకటే జాగ్రత్తలు చెప్పటం ఒకటే నీతులు మారిపొయ్యటం. తలొంచుక్కూర్చోవాలిట. పమిట నిండా కప్పుకోవాలిట. చీర కట్టాలిట. పెళ్ళిచూపుల్లో చీరకట్టాలని రూల్ వుందా! లుంగీకడతాను. ఎలిఫెంట్ పాంట్ వేసుకుంటాను. మేక్సీ తొడుగుతాను నాయిష్టం. వాళ్ళు నన్ను చూశా యిష్టపడేది. నా డ్రస్ చూశా! నువ్వే చెప్పు మామయ్య!" అంది వాసంతి.

    "విన్నావ్ గా రాధాకృష్ణా! ఇహ నువ్వు కానియ్యి," అన్నారు వెంకటరామయ్యగారు. పచ్చి వెలక్కాయ గొంతుకడ్డంగా పడినట్లయింది రాధాకృష్ణకు. ఇరువురి వాదనలోను బలంవుంది. అర్ధముంది. ఒకరి పక్షమె  వహిస్తే రెండోవారికి కోపంవస్తుంది. ఎలా?

    రాధాకృష్ణ కొద్దిసేపు సీరియస్ గ ఆలోచించి రేపటిరోజు పెళ్ళిచూపులనే గండం సవ్యంగాదాటే మార్గము, ఇరువురికి నచ్చేపద్ధతి, ఒకరికొకరు ఎలా సర్దుకు పోవలసింది. దానివల్ల బాధ లేకుండాను, ఎలాగో నచ్చచెప్ప గలిగాడు.



    "రేపొక్కరోజు కళ్ళుమూసుకుంటే ఎట్టాగో అట్టా పనయిపోతుంది. తర్వాత సంగతి తర్వాత" అనుకుంటారు వాసంతి, ఆదిలక్షమ్మ.

    "మొత్తానికి యిరువురినీ ఓ తాటిమీదకు లాక్కొచ్చావు. ఘటికుడు వోయ్ రాధాకృష్ణా!" అన్నారు వెంకట్రామయ్యగారు.

    రాధాకృష్ణ నవ్వూరుకున్నాడు.

                                          3

    ఆ వుదయం లేచింది మొదలు మధ్యాహ్నందాకా ఆదిలక్షమ్మ పనిచేసింది చేసినట్లేవుంది. ఇదే మొదటిసారి పెళ్ళిచూపులు జరగటం. ఇదే మొదటిసారికూడాను, ఆ యింట్లో పెళ్ళివారంటూ రావటం. అందుకే వుదయం వంటతోపాటు ఆవడలు, కారంబూందీ చేసింది. దానిలో మిక్ చర్ తయారుచేయటానికి కావలసినవన్నీ కలిపి జీడిపప్పు మాత్రం ఎత్తుకెత్తువేసింది. మైసూర్ పాక్ చేసింది. మరీ ఒక్కస్వీట్ బాగుండదని పెద్ద హోటల్ నుంచి భర్త చేత జాంగ్రీలు తెప్పించింది. యాపిల్స్ చక్రకేళీలు జాంగ్రీలతోపాటే వచ్చాయి బజారునుంచి.

    ఈ హడావిడి యీ తతంగం చూస్తుంటే వాసంతికి చిర్రెత్తుకొచ్చింది. మామయ్యకిచ్చిన మాటకి కట్టుబడి వుండటంవల్ల పైకి తల్లిమీద ఎగిరి పడలేదు.

    రాధాకృష్ణ అక్కకితోడుగా వుంటుందని తనభార్య జానకిని పంపాడు. జానకి చదువుకున్నది. పెద్దఫామిలీలోంచి వచ్చినపిల్ల. ఫాషన్లు తెలిసినది. ఎవరినీ నొప్పించదు. ఎవరి భావాలువారివి అనేరకం. సింపుల్ గా అలంకరించుకున్నా అందమైనది కావటంవల్ల ఫాషన్స్ చేసుకున్నట్లు కనబడుతుంది. రాధాకృష్ణ జానకిని మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, ఆదిలక్ష్మి అంటూ వేళాకోళం చేస్తుంటారు. దానికి కారణం జానకి తరచు దైవంపేరుతో వుపవాసాలు వుండటమే.



    ఆదిలక్షమ్మ జానకిని చూస్తూనే "రారా. నీ కోసమే ఎదురుచూస్తున్నాను. ఇంకారాలేదేమా అనుకుంటున్నాను. గుమ్మంలో ఎదురయ్యావు." అంది.

    "నాలుగు గంటల తర్వాతకదా పెళ్ళివారొచ్చేది .అందుకే నెమ్మదిగా వచ్చాను," అంది జానకి.

    "పిల్లలేరి! వెనుకవస్తున్నారా?"

    పిల్లలు ముగ్గురూ ఉదయమే కాన్వెంట్ కెళ్ళిపోయారు. మీ తమ్ముడు ఆస్పత్రికెళ్ళారు .సాయంత్రం అందరూ యిక్కడికే వస్తారు. భోంచేసి రాత్రికి ఏకంగా వెళతాం" ఆదిలక్షమ్మ తత్వం తెల్సుకాబట్టి నొచ్చుకుంటుందేమో అని ముందే భోజనంమాట చెప్పింది జానకి.

    "నీవు పదివూళ్ళ పాపన్నవి. నీ యిష్ట మొచ్చినప్పుడు రా, జానకినీ పిల్లలను మాత్రం ఉదయమే పంపించమని వాడితో చెప్పాను, ఎవరు నామాట వింటారు కాబట్టి, వాడునామాట వింటాడు! జానకి నీకయినా తెలియదుటే పిల్లలని తీసుకురావాలని. వాళ్ళు యింతోటి చదువులు చదవకపోతారా, పెరిగి పెద్దవాళ్లు కాకపోతారా! పసి వెధవలు ఉదయం యిల్లు విడిస్తే సాయంత్రం రావటం, ఏమిటో?" తెగబాధపడిపోతూ అంది ఆదిలక్షమ్మ.

    జానకి కంఠస్వరం వింటూనే తన గదిలోంచి బైటకొచ్చింది వాసంతి, చిరునవ్వునవ్వి జానకిని చూపులతోనే పలకరించింది. తల్లి మాట్లాడేవన్నీ పూర్తయిందాకా ఆగి "అత్తయ్యా! పిల్లలినంటే కాన్వెంట్ కి పంపావు. పనికుర్రాడు, కారుడ్రైవరు, పనిమనిషి వాళ్ళంతా ఏమయ్యారు. నీతో తీసుకురావాల్సింది" అంది. 

    "ఇవాళ అల్లరి చేయకూడదమ్మాయ్! తలొంచుకుని బుద్ధిమంతురాలిలాగా సిగ్గుపడుతూ వుండాలి." తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అంది జానకి.



    "ఊ.అలా చెప్పు జానకీ! నువ్వూ చదువుకున్నావు. మంచీ మర్యాద ఎంచక్కా తెలుసు! యిదీ వుంది. ఏంలాభం! ప్రతిదానికి మొండితనం, అల్లరి."

    "ఆ మూడుముళ్ళు పడనీ అన్నీ అవే సర్దుకుంటాయి వదినా!" అంది జానకి.

    "మామంచి మాటన్నావు. నీనోటి వాక్యాన ఈ సంబంధం స్థిరపడితే నాకు సగం దిగులు తగ్గుతుంది. ప్రతిమాటకీ గొడవే,. ఇదెందుకంటుంది, అదెందుకంటుంది. కాస్త వాళ్ళొచ్చి వెళ్ళిందాకా ఎలా మెలగాలో చెప్పుతల్లీ! ఏ అల్లరీ లేకుండా పెళ్ళిచూపులు అయి వాళ్ళెళ్ళిపోతేచాలు. చచ్చి నీకడుపున పుడతాను."

    "అమ్మా! అత్తయ్యకి ఆపరేషన్ అయింది." అంది వాసంతి.

    "ఇదీ దీనివరస" అని నిట్టూర్పు విడిచి జానకివైపు తిరిగి "ఇప్పుడు నువ్వు చేసే పనేంలేదు జానకీ! దాని దగ్గర కూర్చుని కాస్త ఎలా మెలగాలో బోధించు. కాఫీ కలుపుకొస్తాను" అని ఆదిలక్షమ్మ వంటింట్లోకి దారితీసింది.

Best Telugu Sex Stories

ఒక జంట కలిసిన తరుణాన 5

RareDesi.com

telugu sex stories "ఎండాకాలంకదూ!" అంది జానకి.

    "ఎండకి కాదు అమ్మమాటలకి ఈ చీరవిప్పేసి లుంగీషర్ట్ వేసుకువెళతాను. పోనీకదా అని వింటుంటే."

    "చీరవిప్పేసి అలా వెళతాననలేదు రక్షించావు." నవ్వుతూ అని వెంటనే గంభీరంగా ముఖంపెట్టి. "వాసంతీ! మీ మామయ్యకు నాకు మాటిచ్చావు. ఈ ఒక్కసారికీ మా మాటవినాలి. ఆ.ముడుచుకు సిగ్గు పడనక్కరలేదు. తెచ్చిపెట్టుకుని పమిట చుట్టుకున్నట్లు కప్పుకోను అక్కరలేదు. పద నేనూ నీ పక్కనే కూర్చుంటా కదా! మామూలుగావుంటే చాలు అదే అందం." అంది జానకి.

    వినీ విననట్లు "ఊ". అని కుర్చీలోంచి లేచింది వాసంతి. "ఓ అరగంట కళ్ళుమూసుకుంటే వాళ్ళెళ్ళిపోతారు. శనివదిలి పోతుంది." అనుకుంది.

    జానకి వాసంతి హాలులోకివచ్చి గుమ్మందగ్గర ఆగిపోయారు. వాళ్ళను చూసి వెంకట్రామయ్యగారు "రామ్మా జానకీ! ఇలా వచ్చి కూర్చోండి," అన్నారు.

    వాసంతి జానకివచ్చి పెళ్ళివారి ఎదురుకుండా వున్న సోఫాలో కూర్చున్నారు. కింద అయితే కూర్చోను, సోఫాలో అయితేనే కూర్చుంటానని వాసంతి అనటం. దానికి అది లక్షమ్మ అభ్యంతరచెపుతూ గొణిగితే రాధాకృష్ణ అక్కకి సర్దిచెప్పాడు. "సోఫాలో కూర్చోటం అమర్యాదేం కాదు. ఇప్పుడు అందరూ అలాగేచేస్తున్నారు." అని.ఆదిలక్షమ్మ సర్దుకుంది.

    పెళ్ళిచూపులకి పెళ్ళికొడుకురాలేదు. తల్లీతండ్రి అతని పినతల్లి ఈ సంబంధం తెచ్చిన మధ్యవర్తి మొత్తం నలుగురు వచ్చారు.

    ఆదిలక్షమ్మ ఫలహారాలు ప్లేట్లలోసర్ది తీసుకువచ్చి ముందు పెట్టింది. వెంకట్రామయ్యగారికి వంటావిడను పెట్టి భరించేతాహతువున్నా, ఆదిలక్షమ్మ అందుకంగీకరించలేదు. "ఉన్నదిముగ్గురం. ఇంతోటి వంటకు ఓ వంటావిడకూడానా!" అనేది.

    "ఫలహారం కానీండి వదినగారూ! అన్నగారిని తీసుకోమని చెప్పండి" ఆదిలక్షమ్మ ఒదిగి ఓ ఒక్కగా నుంచుని వినయంగా చెప్పటమేగాక భర్తకి కూడా చెప్పింది.

    'వచ్చి పది నిమిషాలు కాలేదు. ఇంతకు క్రితం అమ్మ వీరి ముక్కు ముఖం చూసి ఎరుగదు. అప్పుడే వదినగారు, అన్నగారు అంటూ పరసకలిపి పిలుస్తున్నది. కొత్తవాళ్ళని బంధువుల్లా పిలవటానికి ఎలా మనసవుతుందో!' అనుకుంది వాసంతి.

    మళ్ళీవారు ఫలహారాలు తినటంలో మునిగిపోయారు.

    "అమ్మాయ్! నీ పేరేమిటమ్మా?" అంది పెళ్ళికొడుకు పినతల్లి.



    "వాసంతి" అని చెప్పింది వాసంతి.

    "బాగుంది" అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి జాంగ్రీ ముక్క నములుతూ.

    'నా పేరా? జాంగ్రీయా?' అని అడగాలనే చిలిపి వూహ వచ్చింది వాసంతికి. అంతపనిమాత్రం చేయలేదు.

    కాఫీ ఫలహారాలయాయి. వచ్చినవాళ్ళు వాసంతిని నాలుగు అయిదు ప్రశ్నలు మించి వేయలేదు. వాళ్ళ ముఖ కవళికలు, కలుపుకోరుతనంగా మాటలు చూస్తుంటే వాసంతి వాళ్ళకి నచ్చినట్లే అనిపిస్తున్నది.

    వాళ్ళముందు వాసంతి సిగ్గుపడుతూ ముడుచుక్కూర్చోలేదు. అలా అని గీరగ తలెత్తి ధీమాగానూ కూర్చోలేదు. కారణం లా కోర్చోలేకపోయింది. సమయం వచ్చినప్పుడు చేద్దామనుకున్నవి ఆ సమయం రాగానే కొత్తబిడియంతో ఆచరించలేదు. అలా అయింది వాసంతి స్థితి. అందరినీ పరికించి చూస్తున్నది. వాళ్ళలో ఎవరైనా తనవైపు చూడగానే టక్కున కళ్ళు తిప్పుకుంటున్నది. వచ్చినవాళ్ళు పొడిచేటంత వికారంగాను లేరు. చూపులు మరల్చలేనంత అందంగాను లేరు. వేష భాషలు ఎరువు తెచ్చుకున్నట్లు లేవు. పెళ్ళికొడుకు తల్లి పసిమిచాయ తండ్రి చామనచాయ, వాళ్ళిద్దరినీ మార్చిమార్చి చూసి 'వీళ్ళ సుపుత్రుడు ఎవరిపోలికో!' అనుకుంది వాసంతి.

    పెళ్ళివారితోపాటు పెళ్ళికొడుకు కూడా వస్తాడని అనుకున్నారు. అతనెందుకు రాలేదో తెలియలేదు. వెంకట్రామయ్యగారు అడిగేశారు "అబ్బాయి రాలేదు." అంటూ.

    "మాతో శ్యామ్ కూడా వచ్చేవాడే బావగారూ! వాడి ఫ్రెండ్ అమెరికా వెళుతున్నాడు .ఫ్రెండ్ కోసం తప్పక వాడు వుండిపోవాల్సివచ్చింది. ఎల్లుండి మంచిరోజు .శ్యామ్ ని పంపిస్తాము. పిల్లా పిల్లవాడు చూసుకుంటే అప్పుడు మనప్రయత్నం చేసుకోవచ్చు."



    "అలాగేచేద్దాం" అన్నారు వెంకట్రామయ్యగారు.

    'అబ్బాయిపేరు శ్యామ్. పూర్తిపేరు శ్యామ్ సుందరో ,శ్యామ్ ప్రసాదో, శ్యాంబాబో మరేదో కావచ్చు. ఏపేరయితే ఎవరికికావాలి? వీళ్ళీవాళ చూశారు, ఇహ శ్రీ శ్యామ్ ఎల్లుండి చూస్తారు. అహ! మగపెళ్ళివారంటే ఆడింది ఆట, పాడింది పాట. ఎందుకలా జరగాలి? ఎందుకంటే ఆడాళ్ళు తలవంచుక్కూర్చోబట్టి, ఈరోజంతా పోనీకదా వక్కసారికని వీళ్ళ మాట విన్నాను. ఎల్లుండి చచ్చినా వీళ్ళమాట వినను. ఆ చామదుంపగారు నన్ను చూడటానికి ఇంటికి వస్తారుగా! అప్పుడు మ్యాట్నీకి, ఫస్ట్ షోకి చెక్కేస్తాను. నాగురించి అతగాడు అడిగితే స్నేహితురాలు స్విజర్లాండ్ వెళుతున్నది. అందుకోసం వాళ్ళింట్లో వుండిపోయింది అని చెపితేసరి. తిక్క వదులుతుంది, చెల్లుకి చెల్లు' ఆలోచిస్తున్న వాసంతి చిన్నగా నవ్వుకుంది.



    వాసంతి నవ్వుకోవటం అంతా గమనించారు, అది చూసి జానకి హెచ్చరికగా "ఏమిటో విశేషం! నీలో నీవే నవ్వుకుంటున్నావు. మాతో కూడా చెపుదూ" అంది.



    వాసంతి ఉలిక్కిపడి అందరివైపూ చూసింది. చిరునవ్వుతో అందరూ తన్ని గమనించడం చూసి చటుక్కున సిగ్గుపడి తలదించుకుంది. ఆ తర్వాత 'నాకు బుద్దిలేదు. ఇప్పుడేమొచ్చిందని సిగ్గుపడ్డాను?' అని తన్నితానే విసుక్కుంది.



    వచ్చినవాళ్ళు వాసంతిని పెద్దగా ప్రశ్నలతో వేధించలేదు. వెంకట్రామయ్యగారితోను ఆదిలక్ష్మమ్మతోను కబుర్లాడుతూ వుండిపోయారు.

    పెళ్ళికొడుకు తల్లిపేరు శ్రీదేవమ్మ. వాళ్ళంతా వెళ్ళటానికి లేవంగానే వాసంతి, జానకీ కూడా లేచారు. ఇది మా ఆచారం అంటూ శ్రీదేవమ్మ స్వీట్స్ పాకెట్టు, డజను పళ్ళు, పదిమూరల మల్లెపూలపొట్లం వాసంతికి బొట్టుపెట్టి యిచ్చింది, ఆ తర్వాత అందరివద్ద సెలవుతీసుకుని వెళ్ళిపోయారు.

    ఇదివరలో ఫ్రెండ్స్ పెళ్ళిచూపుల నిమిత్తం వాసంతి నలుగురైదుగురు ఫ్రెండ్స్ యిళ్ళకు వెళ్ళింది, ఆ వచ్చిన పెళ్ళివారు యక్షప్రశ్నలు వేయటం, నఖశిఖపర్యంతం గొడ్డుని పరీక్షించినట్లు పరీక్షించటం, పీకలదాకా కాఫీ టిఫెన్లు వట్టించి లేనివంకలన్నీ పెట్టి వెళ్ళటం చూచిన వాసంతి తనకొచ్చే పెళ్లిపెద్దలు ఆ బాపతువారే అనుకుంది. అందుకు విరుద్ధంగా టిఫెన్ టిఫెన్ లాగే పుచ్చుకొని మాటవరసకన్నట్లు నాలుగుముక్కలు మాట్లాడి, వెళ్ళేటప్పుడు పళ్ళు, పూలు, స్వీట్లు యివ్వటంతో వాసంతి కించిత్ ఆశ్చర్యపోతూ అందరూ ఒకేవిధంగా వుండరని తన అభిప్రాయం మార్చుకోవాలేమో అనుకుంది.

    'వచ్చినవాళ్లు చాలా మర్యాదస్తుల్లాగా కనపడుతున్నారు. వీళ్ళనిబట్టి అబ్బాయి మంచివాడనుకోవాలి" అంది ఆదిలక్ష్మమ్మ.

Best Telugu Sex Stories