RareDesi.com
రాణీని ఇంటిదగ్గర వదిలెసి, ఒక గంట అటూఇటూ తిరిగి ఆమె ఇంటికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొట్టగానే అందమైన చీరకట్టులో పొందికగా ఉన్న ఒక అమ్మాయి తలుపుతీసింది. "రాణీ లేదా" అని అడగబోయి షాకయ్యి నిలుచున్నా. ఎందుకంటే ఆ పొందికైన అమ్మాయి రాణీయే. "ఏమిటో! దీనిలో క్షణానికో కొత్త అందం కనిపిస్తుంది" అని మళ్ళీ అనుకున్నా. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి "ఏం రాజూ బావున్నావా? రా లోపలకి." అంది. "ఆఁ.అక్కడ నాన్న వెయిటింగ్ ఆంటీ. మళ్ళీ వస్తా." అని గబగబా బయటకి వచ్చేసాను. రాణి వాళ్ళ అమ్మకు బై చెప్పి, వచ్చి బైక్ ఎక్కింది. ఆమె కట్టుకున్న చీర, నన్ను తాకి, మెత్తగా గిలిగింతలు పెడుతుంది. జీన్సూ, ఫ్రాక్సూ వేసుకొని ఎక్కినప్పుడు రాని మధురమైన ఫీలింగ్ ఏదో మనసుని ముంచేస్తుంది. ఆ ఫీలింగ్ ఎక్కడ పోతుందో అన్న భయంతో, సైలెంట్ గా బైక్ ను నడుపుతున్నాను. రాణి కూడా ఏమీ మాట్లాడలేదు.మొత్తానికి ఇంటికి చేరుకున్నాము. రాణీని దింపి, బైక్ పార్క్ చేస్తుంటే, రాణి దగ్గరకి వచ్చి "ఏమిటీ అలా సైలెంట్ అయిపోయావూ?" అంది. 'ఏమీలేదు' అన్నట్టుగా తలఊపాను. "ఇంత అందమైన ఫీలింగ్ కోసమే అది ఇప్పుడు వద్దూ అన్నది." అని గబగబా లోపలకి వెళ్ళిపోయింది. ఆమె దేని గురించి అన్నదో అర్ధమై, మనసును మల్లెపూవుతో కొట్టినట్టు అనిపించింది. "రాణీ..ఐ లవ్ యూ.." అనుకున్నా మురిపెంగా.
రాణీ వెనకే లోపలకి వెళ్ళాను. లోపల హాల్లో నాన్న, అమ్మతో పాటూ మరో కొత్త వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఎదురుగా టీపాయ్ మీద ఒక లేప్ టేప్ ఉంది. మమ్మల్ని చూడగానే "అదిగో వచ్చేసారు. ఇక వీళ్ళే డెసిషన్ చెప్పాలి." అన్నాడు నాన్న. పక్కన టూ సీటర్ లో కూర్చున్నాం ఇద్దరం బిక్కుబిక్కుమంటూ. లేప్ టేప్ మా వైపుకు తిప్పి " లతకి కొన్ని మేచెస్ చూసాంరా. దాని టేస్ట్ నీకూ, రాణీ కి బాగా తెలుస్తుందని తనని తీసురమ్మన్నాను." అని మాతో చెప్పి, "మా అబ్బాయి, మా అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్." అని మమ్మల్ని పరిచయం చేసాడు ఆ కొత్తవ్యక్తి. రాణీ నా మొహం చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటుంటే, నాన్న విచిత్రంగా చూసాడు. "ఏం లేదు నాన్నా, మీ అందరి ముందూ చూడడానికి కాస్త సిగ్గు పడుతుంది. నా రూమ్ లోకి వెళ్ళి చూస్తాం." అని, రాణి కంగారు పడుతున్నా పట్టించుకోకుండా లేప్ టేప్ తీసుకొని నా రూమ్ లోకి పోయాను. కంగారుగా చూస్తున్న రాణితో "పరవాలేదు వెళ్ళమ్మా." అని చెప్పి, మిగిలిన వాళ్ళతో కబుర్లలో పడిపోయింది అమ్మ. బెరుకుబెరుకుగా నా గదిలోకి వచ్చింది రాణి. శబ్ధం రాకుండా తలుపేసి బోల్ట్ పెట్టేసాను. రాణి కంగారుగా "ఏయ్.తలపు తియ్.." అంటూ డోర్ దగ్గరకి వెళ్ళబోతుంటే, వెనకనుండి నడుము చుట్టేసి దగ్గరకి లాక్కున్నాను. ఆమె గింజుకుంటూ "వదలరా బనానా.లేకపోతే అరుస్తాను." అంది. "ఇందాక మీ ఇంటి దగ్గర నిన్ను చీరలో చూసినప్పటి నుండీ, నాకూ అరుపులొస్తున్నాయ్. మరి నేను అరిచానా!?" అంటూ ఆమె మెడ వంపులో ముద్దుపెట్టాను. "మ్..అబ్బా..ప్లీజ్ వదలరా." అంది గోముగా. ఆమె మెడ దగ్గరనుండి వస్తున్న సేండిల్ వాసనని పీలుస్తూ "వదలలేనంత టెంప్టింగ్ గా వున్నావే.ఏం చెయ్యనూ?" అంటూ నా వైపుకి తిప్పుకొని పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టా. ఆమె నన్ను విడిపించుకుంటూ "లోపలకి వచ్చింది నీ అక్క పెళ్ళి కోసం. మన శోభనం కోసం కాదు. బయట వాళ్ళు వెయిటింగ్." అని, పళ్ళబిగువున "కాస్త కంట్రోల్ చేసుకోరా.." అంది. ఇక తప్పక, తనని వదిలి, లేప్ టేప్ లో ఫోటోలు చూసి, నలుగురిని సెలెక్ట్ చేసి, బయటకి వచ్చాం. ఆ ఫొటోలని చూసి అమ్మా, నాన్న ఆనంద పడి, డీటైల్స్ పంపమని చెప్పి ఆ మేరేజ్ బ్రోకర్ ని పంపేసారు. "ఇక వెళ్ళొస్తా అత్తయ్యా.. " అని రాణి వెళ్ళబోతుంటే, "భోజనం చేసి వెళుదువుగానిలే రా.." అని తనతో పాటూ వంట గదిలోకి తీసుకుపోయింది.
వంటగదిలో అత్తగారికి భీబత్సంగా సహాయం చేసేసింది రాణి. మొత్తానికి ఒక గంట తరువాత డిన్నర్ పెట్టేసారు. ఇక రాణి బయలుదేరబోతుండగా బయట వర్షం స్టార్ట్ అయింది. రాణి కంగారుపడుతుంటే, "పోనీ ఇక్కడే ఉండిపోమ్మా.నీ ఫ్రెండ్ గది ఖాళీయే కదా.మీ అమ్మకి నేను ఫోన్ చేసి చెబుతాలే." అంది. "అయ్యో వద్దు ఆంటీ.." అని రాణీ కంగారుగా అంటుంటే, "గుడ్ ఐడియా అమ్మా.పైగా ఇందాక చూసిన ఫొటోలు అక్కకు అప్ లోడ్ చెయ్యడం, అక్క ఒపీనియన్ తీసుకోవడం బోలెడంత ఉందిగా.." ఆని అమ్మతో అని, "ఉండిపో రాణీ." అని రాణీతో చెప్పా. రాణి నన్ను కొరకొరా చూస్తుంది. ఇంతలో అమ్మ "కరెక్టేరా.." అంటూ రాణీ వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఏదో మాట్లాడి, "ఇదిగో మాట్లాడు." అని రాణికి సెల్ ఇచ్చింది. రాణి సెల్ తీసుకొని వాళ్ళ ఏదో చెబుతుంటే "సరేనమ్మా.ఓకే.." కట్ చేసి, సెల్ అమ్మకి ఇచ్చేసింది. "సరేరా..అక్కకి ఆ ఫొటోలు అవీ పంపి పడుకోండి. అన్నట్టు అక్క నైట్ డ్రెస్.." అంటూ అమ్మ ఏదో చెప్పబోతుంటే, "నేను చూపిస్తాలే అమ్మా..మీరు పడుకోండి." అన్నా. "సరేరా." అని అమ్మ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే "రాణీ.అక్క నైట్ డ్రెస్ ఇవ్వనా..?" అంటూ వెనక్కి తిరిగే సరికే, రాణి అక్క గదిలోకి పారిపోయి, బోల్ట్ పెట్టేసుకుంది. "అబ్బా.." అనుకున్నా. ఇంతలో నా సెల్ కి మెసేజ్ పెట్టింది రాణి, "బీ ఎ గుడ్ బాయ్.గుడ్ నైట్." అని. అబ్బే, రాణీ లాంటి అమ్మాయి ఇంట్లో ఉంటే, ఎవడైనా గుడ్ బాయ్ లా ఉంటాడా ఏమిటీ? ఏదోలా కెలుకుతాడు గానీ.
______________________________
Best Telugu Sex Stories
No comments:
Post a Comment