RareDesi.com
ఆయన ప్రభుత్వోద్యోగి కావడంతో తాగుడు అలవాటు ఉన్నదని తెలిసినా ఆయనకిచ్చి చేశారు. మొదట్లో తెలియలేదు కానీ. వివాహమై 6 నెలలు గడచిన దగ్గర్నుంచీ, ఆయనతో గొడవపడటం మామూలైపోయింది. అది కూడా రాత్రిపూట బెడ్రూంలో. తాగవద్దని ఎంత వారించినా వినరు. తాగితే కోర్కెలు ఎక్కువ కలుగుతాయని చెప్పి మద్యం సేవించి సెక్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ చేయరు. మద్యం మత్తులో నిద్రలోకి జారుకుంటారు. అసలు మద్యం సేవిస్తే బాగా సెక్స్ చేయగలుగుతారా.?
మద్యం ఎక్కువ మోతాదులో తీసుకుంటే, మద్యానికి బానిసలుగా మారిపోయిన వారిలో.. స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే వారిలో సెక్స్ సామర్థ్యమే కాదు. పిల్లలు పుట్టే సామర్థ్యం కూడా తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. మద్యం అతిగా సేవించడం వల్ల సెక్సులో విఫలం జరుగుతుంది. దీర్ఘకాలంగా మద్యం సేవించేవారిలో నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. పీయూష గ్రంథిపై అది తీవ్రమైన ప్రభావం చూపడంతో అంగ స్తంభన సమస్యలు తలెత్తుతాయి. ఇటీవలి పరిశోధనల్లో తేలిన మరో విషయం ఏంటంటే. అధిక మోతాదులో మద్యం సేవించే వారిలో పురుషాంగంలోని నరాలపై ప్రభావం చూపుతుంది. కనుక మద్యం సేవించడాన్ని నిరోధించాల్సిందే. ఇందుకోసం వైద్యుల సలహాలు తీసుకుని తదనుగుణంగా చికిత్స అందిస్తే, ఆయన మద్యం అలవాటును మాన్పించవచ్చు.
Best Telugu Sex Stories
No comments:
Post a Comment